క్రీస్తు వనితలు - ఉత్తమమైన దానిని ఎంచుకో

అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు - సామెతలు 2:9 నీవు దేనిని ఎక్కువ విలువైనదిగా చూస్తావు? నీకు ప్రాముఖ్యమైనది ఏది? నీవు బహిరoగంగా చేసే ఎంపిక నీ అంతరంగిక స్వభావాన్ని ఏ విధంగా తెలియజేస్తుంది? అందరూ చూసే విధంగా ఘనంగా ఉండాలని ఆశిస్తున్నావా? ఎవరూ చూడనప్పుడు నీవు ఏవిధంగా ఉంటున్నావు? నీ అనుదిన జీవితంలో అత్యున్నత విలువలతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆదిమ క్రైస్తవులు ఒక ఉద్దేశాన్ని కలిగి జీవించారు. దేవునితో గల వారి సంబంధము వారి జీవితాలను నిర్ధేశించింది. వారికి ఏ విషయాలు ముందు చేయాలి అనే ప్రాధాన్యతల పట్టిక వారికి లేదు కాని వారు దేవునితో గల తమ సంబంధముతో తమ అనుదిన జీవితాన్ని ఆయన ఎంపికకు అనుగుణంగా జీవించారు. ప్రాధాన్యతలు అనుదినం మారతాయి కాని విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి మన జీవితంలో నీ ప్రాధాన్యతలు క్రీస్తులో నీ పరిణితిని తెలియజేస్తాయి ...