క్రీస్తు వనితలు - దేవునితో నీ సమయం
1 . దేవునితో నీ సమయం
దేవునితో నీవు గడిపే సమయం ఎలా ఉంది?
ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో అనేక ఒడిదుడుకులను నీవు ఎదుర్కొనవచ్చు. అవి అనుకోకుండా, అకస్మాత్తుగా జరిగిపోతూ ఉంటాయి. దేవుడు ఒక్కోసారి నీ దైనందిన జీవితంలో నీవు ఊహించని విధంగా నిన్ను ఎదుర్కొంటాడు

నీ ప్రతీ పరిస్థితి దేవుని ఆధీనంలో ఉన్నదని అర్థం చేసుకున్నావా ? దేవుడు ఇచ్చే అనూహ్యమైన బహుమతినిస్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలస్యం అయిన, క్రుంగిపోయిన, అలసిపోయిన సమయాలలో ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నావు?

కొద్ది సమయం నీ సమస్యకై ప్రార్ధించు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసి దానిని జ్ఞప్తికి తెచ్చుకో దేవుడు నిన్ను ఏవిధంగా ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతోయెహోవా యందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. సామెతలు 3:5-6
Comments
Post a Comment