Saturday, February 7, 2026

పాత్రవు నీవమ్మా - Song

 





పాత్రవు నీవమ్మా   -  పాత్రవు నీవమ్మా

ప్రభుని పాత్రవు నీవమ్మా

పరిశుద్ధమైన , ఘనమైన  పాత్రవు నీవమ్మా !

1. శారా వలె నీవుండాలి – ఆసక్తితో ప్రభుని సేవలో 

ఆతిథ్యం  నీవివ్వాలి    అందరికీ అన్నివేళలా  

జనముల తల్లివి నీవమ్మా  - జనముల రాజులు నీనుండే వస్తారమ్మా

2.  ఎస్తేరు వలె నీవుండాలి – ఆత్మీయమైన సౌందర్యంతో

ప్రార్ధనలో పోరాడాలి    అన్నిటికై అన్నివేళలా

రాజనగరులో నీవున్నావమ్మా  - నశించిపోయే జనులకు తోడుండాలమ్మా

3. దెబోరా వలె నీవుండాలి – ధైర్యంతో దేవుని సేనలో 

శత్రువుని  ఓడించాలి    అజేయుంగా అన్నివేళలా 

న్యాయాధిపతివై నీవున్నావమ్మా – విశ్వాసులను తల్లివై నడిపించాలమ్మా

4. మరియ వలె నీవుండాలి – స్థిరమైన విశ్వాసంతో

రక్షకుని అందించాలి –  అవనిలో అందరికి అన్నివేళలా 

పరిశుద్ధoగా జీవించాలమ్మా – ఆశీర్వదించబడినదానవు నీవవుతావమ్మా

5. జ్ఞానం కలిగి నీవుండాలి – ఘనమైన పాత్రగా నీవవ్వాలి  

సత్కార్యానికి సిద్దపడాలి –  అర్హురాలిగా అన్నివేళలా 

ఇంటా, బయటా  ధన్యురాలిగా నీవుండాలమ్మా – ముత్యం కంటె అమూల్యం నీవవుతావమ్మా

(2019 GMD WORKSHOP నిమిత్తం ఈ  పాటను రాయడం జరిగింది. Suno AIఉపయోగించి సంగీతాన్ని సమకూర్చాను. మీకు అనువైన బాణీలో ఈ పాటను పాడుకొని దేవుని మహిమ పరచాలని కోరుతున్నాను -రూత్ వినయ్)





రిబ్కా: దేవుని వాగ్దానం మరియు విశ్వాస ప్రయాణం - ఒక ప్రేరణాత్మక జీవిత చరిత్ర(Rebekah: A Life of Divine Election and the Complexity of Faith)

   దైవిక ప్రణాళికలో ఒక మాతృమూర్తి పాత్ర మానవ చరిత్రలో దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చడానికి సామాన్యులను ఎంచుకుని, వారిని అసాధారణమైన కార్యాలకు...

More from this blog...

Read Missionary Vanithalu- 2

Books For Mothers

  • God Made Mothers
  • Power of a Praying wife
  • Daily Decorations
  • Her Decisions
  • Gods women Then and Now

HER DAY CHECK- LIST

HER DAY SONG

GMD Purpse & Objectives

Visit my blog

Visit my blog
ELSELAH BOOKS