MARCH 23
మిషనరీ వనితలు - 2
మిషనరీ వనితలు
మొదటి భాగాన్ని ఆదరించిన పాఠక లోకానికి కృతజ్ఞతలు. క్రీస్తు పొలములో పరిచర్య చేసిన
మరికొందరు మిషనరీ వనితలను ఈ రెండవ భాగము ద్వారా పరిచయం చేయడానికి
సంతోషిస్తున్నాము.
సంస్కరణ వీరుడు
మార్టిన్ లూథర్
జీవితంలో పురికొల్పించే శక్తిగా
గుర్తించబడిన కాథరిన్ వాన్ బోరా, సెరంపూర్ మిషన్ స్థాపనలో
విలియం కేరీ బృందంతో చురుకుగా పనిచేసి మూలస్థంభంగా నిలిచిన హన్నా
మార్ష్ మన్ , హడ్సన్ టేలర్ సతీమణి మరియు ‘చైనా ఇన్ లాండ్ మిషన్’ కు తల్లిగా పిలువబడిన మారియా జేన్ టేలర్, భారత దేశంలో
విశేషంగా వైద్య సేవలు అందించాలనే దీక్షతో వచ్చి అనేకులకు మార్గదర్శకంగా నిలచిన
అన్నా శారా కుగ్లర్, మహిళా వైద్య శిక్షణను ప్రారంభించిన తొలి
వనిత డేమ్ ఎడిత్ మేరీ బ్రౌన్, ఓరియంటల్
మిషన్ ను స్థాపించి ప్రపంచ
వ్యాప్తంగా సువార్త ప్రకటించడమే కాకుండా తన అనుదిన ధ్యాన మాలిక 'ఎడారిలో సెలయేర్లు' పుస్తకం ద్వారా అనేకుల హృదయాలను
క్రీస్తు ప్రేమతో స్పృశించిన లెటీ బర్డ్ కౌమాన్, భారతదేశంలో
విద్యార్థి పరిచర్యకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి
ఆత్మీయ తల్లిగా పిలవబడిన ఎలోయిస్ స్టెరట్, భారత దేశం లోని అట్టడుగు స్థితిలో ఉన్న బీద ప్రజలకు , అనాధలకు మరియు వ్యాధిగ్రస్తులకు మహోన్నతమైన సేవ చేసిన మథర్ థెరిస్సా,
మన్య ప్రాంతంలో ఆదివాసీ ప్రజల
మధ్య వైద్య మిషన్ ను స్థాపించి అక్కడి ప్రజలలో చైతన్యం కోసం కృషి
చేస్తున్న డాక్టర్ ఐరిస్ పాల్, తమ ప్రార్ధనల ద్వారా సంఘానికి
గొప్ప నాయకులను తీర్చిదిద్దిన మాతృ మూర్తులు మౌనిక, సుసన్నా వెస్లీ, మోరో గ్రాహం మరియు ఆదర్శ పత్నిగా
సుప్రసిద్ధి పొందిన శారా ఎడ్వర్డ్స్ యొక్క జీవిత చరిత్రలు మనందరి ఆత్మీయ
అభివృద్ధికి ఎంతగానో తోడ్పడగలవు.
Comments
Post a Comment