క్రీస్తు వనితలు - ఆతిథ్యము
.jpg)
యేసు చెప్పెను , “నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” మత్తయి 22:39 ఆతిథ్యము అనునది స్వాగతించే వరము. ఒకరినొకరిని మరియు క్రొత్తవారిని ఆదరిస్తుంది. అది తెరచి ఉన్నచిన ద్వారము మరియు తెరచి ఉంచిన హృదయము. ఆతిథ్యము ఇచ్చుట ద్వారా మనము దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తాము. మనందరి కొరకు ఆయన పరలోక రాజ్యపు ద్వారాలను తెరచి ఉంచాడు. అబ్రహాము తనయింటికి వచ్చిన అపరచిత వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చాడు. మరియ, మార్తాల బేతనియ గృహం యేసు క్రీస్తుకు ఆతిథ్యమిచ్చిన గృహము. యెషయా గ్రంథములో, ప్రకటన గ్రంథములో నూతన యెరుషలేములో ప్రపంచ జనులందరు కలసి చేసుకునే విందు గురించి వివరించబడింది. ఆతిథ్యము క్రొత్తవారితో కలసి చేసుకునే సహవాసపు విందు. ఆతిథ్యానికి తెరచి ఉంచిన హృదయము మరియు సిద్ధముగా ఉన్న హస్తాలు చాలు. ఘనమైన విందులు అవసరం లేదు. ఆతిథ్యము ఇచ్చే సుగుణాన్ని అనుదిన జీవితంలో అభ్యసిద్దాం. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. రోమా 12:13 క్రొత్తవారికి, నూతన పద్దతులతో ఆతిథ్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని చేత ప్రేమించబడ్డావని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులను అలాగే ప్రేమిస్తున్నావా? ఇతరులకు మేలు చేసి వా...