క్రీస్తు వనితలు -దేవుని స్వరము విని నడచుకో

మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొకశబ్దము నీ చెవులకు వినబడును. యెషయా30 : 21 దేవుడు నీవు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో ఎలా తెలుసుకుంటావు? దేవుని మహిమపరిచే విధంగా నీవు ఎలా నిర్ణయాలు తీసుకుంటావు? ఆయన ఇచ్చే దైవికమైన, మానవ సంబంధమైన నడిపింపును ఎలా గ్రహిస్తావు? ఆయన నిన్ను నడిపిస్తానని వాగ్ధానం చేస్తాడు. నీ హృదయంతో మాట్లాడతాడు.లేఖనాలను పరిశోధించు. బైబిల్ ద్వారా బోధ, శిక్షణ,జ్ఞానము అనుగ్రహించబడుతుంది. లేఖనాల ద్వారా నీవు దేవునితో సహవాసం కలిగివుంటావు. ఆయన నిన్ను నడిపిస్తానని వాగ్ధానం చేస్తాడు. నీ హృదయంతో మాట్లాడతాడు.లేఖనాలను పరిశోధించు. బైబిల్ ద్వారా బోధ, శిక్షణ,జ్ఞానము అనుగ్రహించబడుతుంది. లేఖనాల ద్వారా నీవు దేవునితో సహవాసం కలిగివుంటావు. దేవుని నడిపింపును తీసుకోవడానికి, దేవుని మెల్లని స్వరము వినడానికి సమయం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ అడుగు వెంబడి అడుగులో నిలచి ఉంటాడు. నీకు గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు దేవుని బిడ్డల సహవాసం కోరుకో. ఒంటరిగా ఉంటే దేవుని మార్గం నుండి తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా దేవున...