క్రీస్తు వనితలు -దేవుని స్వరము విని నడచుకో
మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ
దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొకశబ్దము నీ చెవులకు వినబడును. యెషయా30:21
దేవుడు నీవు ఏమి చేయాలని
కోరుకుంటున్నాడో ఎలా తెలుసుకుంటావు? దేవుని మహిమపరిచే విధంగా నీవు ఎలా నిర్ణయాలు
తీసుకుంటావు? ఆయన ఇచ్చే దైవికమైన, మానవ సంబంధమైన నడిపింపును ఎలా గ్రహిస్తావు?
ఆయన నిన్ను నడిపిస్తానని వాగ్ధానం చేస్తాడు. నీ
హృదయంతో మాట్లాడతాడు.లేఖనాలను పరిశోధించు. బైబిల్ ద్వారా బోధ, శిక్షణ,జ్ఞానము
అనుగ్రహించబడుతుంది. లేఖనాల ద్వారా నీవు
దేవునితో సహవాసం కలిగివుంటావు.
ఆయన నిన్ను నడిపిస్తానని వాగ్ధానం చేస్తాడు. నీ
హృదయంతో మాట్లాడతాడు.లేఖనాలను పరిశోధించు. బైబిల్ ద్వారా బోధ, శిక్షణ,జ్ఞానము
అనుగ్రహించబడుతుంది. లేఖనాల ద్వారా నీవు
దేవునితో సహవాసం కలిగివుంటావు.
దేవుని నడిపింపును
తీసుకోవడానికి, దేవుని మెల్లని స్వరము వినడానికి సమయం తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు
నీ అడుగు వెంబడి అడుగులో నిలచి ఉంటాడు.
నీకు గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు దేవుని బిడ్డల సహవాసం కోరుకో. ఒంటరిగా ఉంటే దేవుని మార్గం నుండి తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా దేవుని నడిపింపును కోరుకో. ఆయన స్వరాన్ని విని హృదయానుసారంగా వెంబడించు. దేవుని వాక్యానికి లోబడు.
ప్రతి దినం దేవుని
స్వరాన్నివినడానికి ప్రయత్నిస్తున్నావా? ఆయన మార్గంలో నడవడం దేవునికి ఇష్టమైనదని
విశ్వసిస్తున్నావా? నీ ప్రణాళికలు కాకుండా దేవుడు ఇచ్చేsurprise కొరకు
ఎదురుచూస్తున్నావా? దేవుని బిడ్డల సహాయం తీసుకుంటున్నావా? నూతన మార్గాలకు, నూతన తలంపులకు సన్నిద్ధంగా
ఉంటున్నావా?
విశ్వాసంతో ఒక్కో అడుగు ముందుకు
వెయ్యి. నీకు ఉన్న అన్ని మార్గాలను వాటి లాభనష్టాలను నోట్ చేసుకో. కౌన్సిలర్ ని
గాని, మెంటర్ ని గాని సంప్రదించు. యాకోబు 1:5 వాగ్ధానాన్ని విశ్వసించు. గందరగోళ
పరిస్థితిలో నిర్ణయం తీసుకునేముందు దేవుని సన్నిధిలో తగినంత సమయం గడుపు.
I am satisfied that when the
Almighty wants me to do or not to do any particular thing, He finds a way of
letting me know – Abraham Lincoln
ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును
యెహోవా వాని నడతను స్థిరపరచును - సామెతలు 16:9
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా
ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు - యాకోబు 1:5
Comments
Post a Comment